Friday, April 26, 2024

‘ఖిలాడి’ అనసూయ పై మరో అప్డేట్

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శరత్ మండవ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు రవితేజ. అయితే ఖిలాడి సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మీనాక్షి చౌదరి, డింపుల్ హాయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే సీనియర్ నటుడు అర్జున్, యాంకర్ అనసూయ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా అనసూయ పాత్రకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. అనసూయ పాత్ర ఇంటర్వెల్ సమయంలో సినిమాకు పెద్ద ట్విస్ట్ ఇచ్చే పాత్రగా ఉంటుందట. ఇప్పటికే తన రోల్ కు సంబంధించిన షూటింగ్ ను అనసూయ పూర్తి చేసుకుంది. మరి చూడాలి అనసూయ పాత్ర ఏమేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement