Thursday, October 21, 2021

లాభాల్లో ట్రేడ్ అవుతున్న మార్కెట్లు..

గత రెండు రోజుల నుంచి నష్టాలను చవిచూస్తున్న సూచీలు బుధవారం సానుకూలంగా ట్రేడ్‌ అవుతున్నాయి. వరుసగా రెండు రోజుల నష్టాల నేపథ్యంలో కీలక రంగాల్లో తాజా కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ఉదయం 9:38 గంటల సమయంలో సెన్సెక్స్‌ 102 పాయింట్ల లాభంతో 52,652 వద్ద.. నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 15,779 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.24 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఆసియా మార్కెట్లు సైతం నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి  రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, మారుతీ, టీసీఎస్‌ వంటి కీలక కంపెనీల షేర్లు రాణిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి.

ఇది కూాడా చదవండి:సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి బీఓబీ నోటిఫికేషన్‌ విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News