Saturday, May 4, 2024

ధనుష్ ముందుకి మరో తెలుగు సినిమా ప్రపోజల్ ?

తమిళ స్టార్ హీరో ధనుష్ కు ఒక్క తమిళ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ధనుష్ హిందీ, ఇంగ్లీష్ తమిళ్ లో సినిమాలు చేస్తున్నాడు… కానీ తెలుగులో స్ట్రైట్ గా ఒక్క సినిమా కూడా చేయలేదు. కాగా ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో స్ట్రైట్ గా తెలుగులో ఓ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమాను నారాయణదాసు నారంగ్, పి రామ్ మోహన్ రావు నిర్మించబోతున్నారు.

ఇదిలా ఉండగా ధనుష్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో లేదో నిర్మాతలు క్యూ కడుతున్నారు. అందులో భాగంగానే సితార ఎంటర్టైన్మెంట్ అధినేత సూర్యదేవర నాగ వంశీ ధనుష్ తో తెలుగులో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఇప్పటికే ధనుష్ ముందు తన ఆలోచనను కూడా ఉంచాడట. దీనిపై ధనుష్ నిర్ణయం గురించి ఎదురుచూస్తున్నాడట నాగ వంశీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement