Thursday, May 16, 2024

పవన్ హరీష్ సినిమాపై మరో అదిరిపోయే అప్డేట్ ?

గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఉండబోతుంది అని అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా సినిమాపై అంచనాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. దానికి కారణం గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కావడమే. పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారు. అలాగే పవర్ ఫుల్ డైలాగ్ లతో అదరగొట్టారు. ఇదిలాఉండగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

ఈ చిత్రానికి సంబంధించిన కథ లో హరీష్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా చేయి వేశారట. ఈ ఇద్దరు కలిపి మంచి కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రం చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement