Tuesday, May 21, 2024

Animal | ఎక్స్‌ట్రా రన్‌టైంతో ఓటీటీలోకి వచ్చేస్తున్న యానిమల్ !

రణబీర్ కపూర్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన మూవీ ‘యానిమల్’. ఫాదర్ సెంటిమెంట్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ హీరోయిన్స్ గా నటించగా అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.

గతేడాది డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 900 కోట్ల కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా, ఈ సినిమా OTT విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ మూవీని రేప‌టి నుంచి (జనవరి 26) తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్టు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

అయితే ఈ సినిమా రన్‌టైమ్ ఎక్కువగా ఉండటంతో కొన్ని సన్నివేశాలను కట్ చేయాల్సి వచ్చిందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఓటీటీ రిలీజ్‌లో కట్ చేసిన సీన్స్‌తో పాటు 3 గంటల 29 నిమిషాల రన్ టైంతో స్ట్రీమ్ కాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆ ఎక్స్ ట్రా రన్ టైమ్ లో ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. దీంతో థియేటర్లలో సినిమా చూసిన వారు కూడా ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement