Sunday, May 5, 2024

Animal | యానిమల్ బాక్సాఫీస్‌ కలెక్షన్స్.. రూ.800 కోట్ల క్లబ్‌లో సందీప్ వంగా మూవీ

బాలీవుడ్ స్టార్ రన్‌బీర్ కపూర్‌ హీరోగా.. డైరకెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్ యానిమల్‌. డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద వసూల్ల సూనామి సృఫ్టస్తోంది. ఈ సినిమా రిలజీ అయిన 16వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతోంది. రూ. 800 కోట్ల క్లబ్బులో చేరింది. వరల్డ్ వైడ్‌గా యానిమల్ 16 రోజుల్లో రూ. 815.15 కోట్ల గ్రాస్‌ను దాటి 800 కోట్ల క్లబ్బులో చేరింది. దీంతో రణబీర్ కపూర్ కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది (జనవరి) 26 నుంచి స్ట్రీమింగ్‌కు రానుందని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement