Thursday, May 2, 2024

ఎనర్జిటిక్ స్టార్ తో అనిల్ రావిపూడి ?

అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. కాగా ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాడు అనిల్ రావిపూడి. ఇదిలా ఉండగా అనిల్ రావిపూడి తన తర్వాత సినిమా ఈ హీరోతోనే అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తో అనిల్ రావిపూడి తన తర్వాత సినిమా చేయబోతున్నాడని… ఇప్పటికే కథ విషయమై ఇద్దరు పలుమార్లు చర్చించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఫుల్ ఫన్ తో ఈ సినిమా ఉండనుందట. కాగా ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమా తో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement