Friday, April 26, 2024

లేదంటూనే సుక్కు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అనసూయ

జబర్దస్త్ యాంకర్ అనసూయ తన అందంతో అభినయంతో బుల్లితెర నుంచి వెండితెర వైపుకు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా అనసూయ నటన ప్రేక్షకులకు ఎంతగానో గుర్తుండిపోయింది. అయితే ఇప్పుడు సుకుమార్ బన్నీ తో పాన్ ఇండియా సినిమా పుష్ప చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా అనసూయ నటిస్తుందంటూ గతంలో వార్తలు వచ్చాయి.

కానీ అనసూయ మాత్రం ఈ సినిమాలో నటించడం లేదని చెప్పింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనసూయకు ఛాన్స్ ఇచ్చేసాడట సుకుమార్. ఇప్పటికే అనసూయ కూడా షూటింగ్ లో పాల్గొంటుందని వార్తలు వస్తున్నాయి. దానికి తోడు మంచి రోజులు ముందున్నాయి. మళ్లీ పనిలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. సుకుమార్ కి కృతజ్ఞురాలిని అంటూ సెట్ లో అడుగు పెట్టిన ఓ పిక్ ను పోస్ట్ చేసింది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

https://www.instagram.com/p/CN7c8L_LoEd/?igshid=2o034mcbi65t

Advertisement

తాజా వార్తలు

Advertisement