Wednesday, April 24, 2024

నేటి సంపాద‌కీయం – ప్రాణ వాయువు క‌ల్లోలం….

ప్రాణాన్ని నిలబెట్టే ఆక్సిజన్‌ ప్రాణాలు తీయడం కరోనా మహత్యమే. మహా రాష్ట్ర నాసిక్‌లోని డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ ఆస్పత్రి ఆవరణలో ఆక్సిజన్‌ లీక్‌ సంఘటన కరోనా కష్టకాలంలో పులిమీద పుట్రవంటిదే. సిలిండర్లలోకి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ నుంచి ఆక్సిజన్‌ నింపుతుండగా, గ్యాస్‌ లీక్‌ కావ డం,ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోవడం అన్నీ ఒకేసారి జరి గాయి. ఈ దుర్ఘటనలో 22 మంది మరణించినట్టు అధికారికంగా చెబుతున్నప్పటికీ, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువేనని అనధికార వార్తలు వచ్చాయి. ఈ ఘటనజరిగిన సమయంలో ఆస్పత్రిలో ఉన్న 150 మంది రోగులను వేరే ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఆక్సిజన్‌ కోసం కోవిడ్‌ ఆస్పత్రులు ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తులను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ విషయమై ప్రత్యేకంగా దృష్టిని సారించారు. పారిశ్రామిక దిగ్గజం ముఖేష్‌ అంబానీ ప్రధాని విజ్ఞప్తికి స్పందించి వంద టన్నుల ఆక్సిజన్‌ సరఫరా కు ఏర్పాట్లు చేశారు.మరో పారిశ్రామిక దిగ్గజం టాటా కూడా సానుకూలంగా స్పందించి సకాలంలో ఆదుకున్నారు.ఆక్సిజన్‌ కొరత లేకుండా ప్రాణావసరాలకు మాత్రమే ఆక్సిజన్‌ను వినియోగించేట్టు పారిశ్రామిక వేత్తలను ప్రధాని హెచ్చరించారు. ఆక్సిజన్‌ కొరత లేకపోవడంతో చాలా ఆస్పత్రుల్లో వెంటిలేటర్లకు బదులు ఆక్సిజన్‌ సిలిండర్ల ద్వారానే ప్రాణవాయువును అందిస్తున్నారు. కరోనా విసిరిన సవాల్‌ను ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి ఎప్పటికప్పుడు పరిస్థితినితెలుసుకుని స్వయంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆస్పత్రుల్లోని ఐసీయూల్లో ప్రాణావసరాలను తీరుస్తున్న ఆక్సి జన్‌ సరఫరా విషయంలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ప్రధానమంత్రి స్వయంగా తెలుసుకుంటున్నారు. అయినప్పటికీ నాసిక్‌ ఆస్పత్రిలో లీకేజి దుర్ఘటన చోటు చేసుకోవ డంలో మానవ తప్పిదం కూడా ఉంది. ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడం, గ్యాస్‌ సరఫరా సమయంలో సాంకేతిక నైపుణ్యం కలిగిన వారు లేకపోవడం కారణమని ప్రాథమిక వార్తలుసూచిస్తున్నాయి. కరోనాక్లిష్ట సమయంలో కూడా ఆస్పత్రుల్లో సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడం నేరపూరిత నిర్లక్ష్యమే.ఈ విషయమై సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర మైన హెచ్చరిక చేసింది. సకాలంలో ఆక్సిజన్‌ను అందించి రోగుల ప్రాణాలను నిలబెట్టా ల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని సూటిగా ప్రశ్నించింది.
సుప్రీంకోర్టు హెచ్చరించిన తర్వాత కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ప్రభుత్వ యంత్రాంగంలో ఏ మాత్రం మార్పు రావడంలేదనడానికి నిదర్శనం. అంతేకాకుండా, రాష్ట్రాల మధ్య ఆక్సి జన్‌ కోసం పోటీ ఎక్కువైందనడానికి హర్యానా మంత్రి అనిల్‌ విజ్‌ చేసిన ఆరోపణ నిలు వెత్తు నిదర్శనం. తమ రాష్ట్రానికి రావల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను ఢిల్లీ ప్రభుత్వం తరలిం చుకుని పోయిందంటూ కేంద్రానికి ఆయన ఫిర్యాదు చేశారు. ఢిల్లీ లోని ఆస్పత్రుల్లో ఆక్సి జన్‌ కొరత గురించి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధానమంత్రికి పలు మార్లు విజ్ఞప్తి చేశారు. బీజేపీ యేతర రాష్ట్రాల పట్ల వ్యాక్సిన్‌,ఆక్సిజన్‌ సరఫరా విషయంలో వివక్ష చూపుతున్నారని కూడా ఆయన ఇప్పటికే ఆరోపించారు. హర్యానాకోసం పంపిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ ను ఢిల్లీ కి తీసుకుని వెళ్ళమనిసంబంధిత అధికారులు ఆదేశించి ఉండ వచ్చు.దేశ రాజధానిలో కోవిడ్‌ బీభత్సం ఎక్కువగా ఉన్న దృష్ట్యా, ఫరీదాబాద్‌కి వెళ్ళా ల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను ఢిల్లీ కి తరలించి ఉండవచ్చు. అయితే, వ్యాక్సిన్‌,ఆక్సిజన్‌ సరఫరాల్లో అంతా గందరగోళం చోటు చేసుకుంటోందన్నది యథా ర్ధం. ఫిబ్రవరి-మార్చి మాసాల్లో విదేశాలకు 9.5 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌ ఎగుమతి చేయడం వల్లనే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందన్న ప్రతిపక్షాల ఆరోపణల్లోఅసత్యం లేకపోవచ్చు. వ్యాక్సిన్‌ పంపిణీ లో గందరగోళ పరిస్థితి వల్లనే కొరతఏర్పడింది. పారిశ్రామికావసరా లకు ఆక్సిజన్‌ వాడుకను తగ్గించుకుని కోవిడ్‌ ఆస్పత్రిలకు సరఫరా చేసేందుకు పారిశ్రామి కవేత్తలు ముందుకు వచ్చినా, వ్యాక్సిన్‌ ఉత్పత్తులు పెరిగినా కొరత ఉందన్న హాహాకారాలు వెలువడటానికి వాటిని పంపిణీ చేసే సంస్థల మధ్య సమన్వయం,సహకారం లేకపోవడమే కారణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement