Friday, April 26, 2024

‘ఐకాన్’ కనబడుటలేదు…బన్నీకి నిజంగానే కనబడదట ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. మామూలుగా అల్లు అర్జున్ డిఫరెంట్ గా తన సినిమాలలో కనిపిస్తూ ఉంటారు. కానీ ప్రయోగాలు చేయడానికి మాత్రం అంతగా ఇష్టపడరు.

అయితే ఐకాన్ సినిమాకి మాత్రం ఓ కొత్త ప్రయోగం చేస్తున్నాడట. ఐకాన్ కనబడుటలేదు అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బన్నీకి నిజంగానే కనిపించదట. అతను ఓ గుడ్డివాడి పాత్ర చేయబోతున్నాడట. గతంలో రాజా ది గ్రేట్ సినిమా లో రవితేజ గుడ్డివాడి పాత్రలో నటించి ఘన విజయం సాధించారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement