Thursday, May 2, 2024

బన్ని బర్త్ డే కి పుష్ప టీజర్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే వచ్చేస్తోంది. ఏప్రిల్ 8వ తేదీన బన్నీ పుట్టినరోజు. దీంతో అభిమానులు బన్నీ కొత్త మూవీ పుష్ప నుంచి ఫస్టు గ్లింప్స్ ను గానీ .. టీజర్ ను ఆశిస్తున్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా తప్పకుండా స్పెషల్ ట్రీట్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే అభిమానుల కోసం ఖచ్చింతంగా ఏదో ఒకటి విడుదల చేసేందుకు సిద్దమవుతోంది చిత్రం యూనిట్. దీనికి సంబంధించిన ప్రకటన తర్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది.

పుష్ప సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సుకుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ .. లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. అయితే ఆయన స్మగ్లర్ గా మారడం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుందట. అదేమిటనేది ఇప్పుడు బన్నీ అభిమానులలో ఆసక్తిని రేకేస్తోంది. అడవి నేపథ్యంలో సాగే కథ .. బన్నీ లుక్ ఇప్పటికే అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా నటిస్తోంది. ఆమె లుక్ ను చూడాలని కూడా అభిమానులు ఆరాటపడుతున్నారు. జగపతిబాబు .. ప్రకాశ్ రాజ్ .. ఫహద్ ఫాసిల్ .. హరీశ్ ఉత్తమన్ పాత్రలు బలమైన .. వైవిధ్యభరితమైన పాత్రలుగా ఉంటాయని సుకుమార్ చెప్పడం అంచనాలను పెంచుతోంది. ఆగస్టు 13వ తేదీన ఏ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement