Sunday, April 28, 2024

బ‌న్నీ బ‌ర్త్ డే.. ఆయ‌న ఇంటిద‌గ్గ‌ర ఫ్యాన్స్ ర‌చ్చ‌

నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు.. ఈ క్రమంలోనే బన్నీని కలిసేందుకు అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. తన కోసం ఇంటివద్దకు చేరుకున్న అభిమానులను కలిసేందుకు బన్నీ బయటకు వచ్చి.. వారిని ఆప్యాయంగా పలకించారు. బన్నీతోపాటు.. ఆయన కూతురు అల్లు అర్హ.. కుమారుడు అయాన్ సైతం బయటకు వచ్చి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దిలా ఉంటే.. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా నిన్న విడుదలైన పుష్ప 2 టీజర్ యూట్యూబ్‏లో దూసుకుపోతుంది. వేర్ ఈజ్ పుష్ప.. హంట్ బిఫోర్ రూల్ అంటూ విడుదలైన ఈ గ్లింప్స్ సినీ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులోని పులి సీన్ అయితే టీజర్ కు హైలెట్ గా నిలిచింది. దీంతో విడుదలైన గంటల వ్యవధిలోనే మిలియన్ వ్యూస్ పైగా రాబట్టింది.ఇప్పటివరకు తెలుగులో 18 మిలియన్ వ్యూస్ రాబట్టడం విశేషం.. ఇక హిందీలో ఏకంగా 20 మిలియన్ వ్యూస్ రాబట్టింది. మొత్తానికి బన్నీ టీజర్ తోనే రికార్డ్స్ మోత షూరు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement