Tuesday, April 30, 2024

అక్కినేని నాగచైతన్య…. ప్లాన్ ఏంటో ?

అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం థాంక్యూ. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కానీ కరోనా కారణంగా ఈ షూటింగ్ వాయిదా పడింది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశాడు. అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన లవ్ స్టొరీ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.

ఈ రెండింటితో పాటు బాలీవుడ్ లో అమీర్ ఖాన్ లాల్ సద్దా సింగ్ సినిమాలో కీలక పాత్రలో చేస్తున్నాడు. అది కూడా కరోనా కారణంగా ఆగిపోయింది. ఒక వేళ కరోనా లేకపోయి ఉంటే.. ఈ మూడు సినిమాలు కూడా ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది. కాగా ఇందులో అమీర్ ఖాన్ సినిమా ఒకవేళ ఆలస్యమైనా…థాంక్యూ, లవ్ స్టోరీ సినిమాలు మాత్రం కరోనా తగ్గగానే రిలీజ్ అవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement