Friday, May 17, 2024

తెలంగాణలో వ్యాక్సినేషన్ బంద్!

తెలంగాణలో వ్యాక్సినేషన్ డ్రైవ్​ను నిలిపివేశారు. ఇవాళ, రేపు టీకా పంపిణీని నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మొదటి రెండు డోస్​ల మధ్య కనీసం 12 వారాల వ్యవధి ఉండాలని కేంద్రం ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. ఈ  నేపథ్యంలో తెలంగాణలో ప్రారంభించిన కొవిడ్ సెకండ్ డోస్ స్పెషల్ డ్రైవ్​ను నిలిపివేస్తున్నట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేంద్రం  నిబంధనల ప్రకారం… కొవిషీల్డ్  తీసుకున్న వారు 12 నుంచి 16 వారాల మధ్య మాత్రమే రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది.  రాష్ట్రంలో ఇప్పటికి వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అత్యధిక శాతం కొవిషీల్డ్ తీసుకున్న నేపథ్యంలో రెండో డోస్ డ్రైవ్ ​ను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. సోమవారం తిరిగి వ్యాక్సినేషన్ డ్రైవ్​ను ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.

కాగా, తొలి డోస్ వేసుకున్న వారు రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్న నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌ధిని కేంద్రం అమాంతం పెంచింది. నిపుణుల క‌మిటీ సిఫారసు మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సీరం కంపెనీకి చెందిన కోవీషీల్డ్ తొలి డోస్ కు రెండో డోస్ కు మ‌ధ్య వ్య‌వ‌ధిని ఏకంగా 16 వారాల‌కు పెంచింది. గతంలో ఈ గ్యాప్ 4 నుంచి 6 వారాలు ఉంది. కానీ దీన్ని 12 నుంచి 16 వారాలు పెంచాలని ఈ కమిటీ సూచించింది. ప్రస్తుతం తొలి డోస్ తీసుకున్న తర్వాత 6 నుంచి 8 వారాలు విరామం పాటిస్తుండగా.. ఇకపై 12 నుంచి 16 వారాలకు పెంచాలని జాతీయ వ్యాధినిరోధక సాంకేతిక సలహా బృందం సూచించింది. అయితే, కొవాగ్జిన్‌ వ్యవధిలో మాత్రం మాత్రం ఎటువంటి మార్పులను సూచించలేదు.

ఇదీ చదవండి: కోవిషీల్డ్ టీకా: రెండో డోస్ కావాలంటే 12-16 వారాలు ఆగాల్సిందే!

Advertisement

తాజా వార్తలు

Advertisement