Tuesday, May 7, 2024

అఖండ…. ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే !!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ అఘోర గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ ప్రగ్యా కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు.

ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందట. ఇంకా పదిహేను నుంచి ఇరవై రోజుల షూటింగ్ మాత్రమే ఉందట. అది కూడా అయిపోతే అఖండ పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టే అని చెప్పారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా.. ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ను ప్రేక్షకుల ను విశేషంగా ఆకట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement