Monday, April 29, 2024

అజిత్ వ‌ర‌ల్డ్ టూర్ సెకండ్ సీజన్.. వైర‌ల్ గా ఫొటో

స్టార్ హీరో అజిత్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా.. ఆయ‌న చాలా సింపుల్ గా ఉండ‌టానికే ఇష్ట‌ప‌డ‌తాడు. ఈయ‌న న‌టించిన త‌మిళ చిత్రాల్లో చాలా వ‌ర‌కు తెలుగు..ఇత‌ర భాష‌ల్లో కూడా డ‌బ్ అవుతుంటాయి. సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా అజిత్ ఆయ‌న ల‌గ్జ‌రీ బైక్ పై వ‌ర‌ల్డ్ టూర్ ల‌కి వెళ్తున్న సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరో అజిత్ సామాన్యుడిలా తనకు నచ్చినప్పుడు టూర్ కి వెళుతూ ఉంటారు. తాజాగా ఆయన వరల్డ్ టూర్ రెండో దశను కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆయన తన మోటార్ బైక్ పక్కన కూర్చున్నట్లుగా ఉంది ఆ ఫోటో. ఇంకేముంది ఈ ఫోటో అలా బయటకు వచ్చిందో లేదో ఇలా ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

అజిత్ కి స్వతహాగా సాహాసాలు చేయడం ఇష్టం. అంతేకాకుండా ప్రపంచాన్ని చుట్టి రావాలనేది ఆయన బలమైన కోరిక. అందుకే తన స్టార్ డమ్ ని పక్కన పెట్టి తనకు నచ్చినట్లుగా ఇలా స్నేహితులతో కలిసి పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఆయన వరల్డ్ టూర్ లను సైతం ఓ డ్యాక్యుమెంటరీగా తీయాలని ఆయన భావిస్తున్నారట. త్వరలోనే ఆ డాక్యుమెంటరీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఆయన ఫ్యాన్స్ మరింత ఎక్కువ సంబరపడిపోతారు. తాను వరల్డ్ టూర్ లో ఎలా ఉంటాను ఏం తింటాను ఎలాంటి సహాసాలు చేస్తాను లాంటి విషయాలను ఆయన షేర్ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వరల్డ్ టూర్ సెకండ్ స్టేజ్ కాగా చివరి దశ ఈ ఏడాది నవంబర్ లో చేసే అవకాశం ఉంది.ఇప్పుడు అజిత్ ఫొటో వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement