Thursday, February 22, 2024

అలాంటి ఏ పదవులైనా నాకు గడ్డిపోచతో సమానం : ఈటల రాజేందర్

వరంగల్: బీసీలంతా ఐక్యమైతే రాజ్యాధికారం బీజేపీదే అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే ఈట‌ల మీడియాతో మాట్లాడుతూ.. నా ఆత్మగౌరవాన్ని, నా సొంత ఆలోచనలను వంచన చేసే ఏ పదవులయినా నాకు గడ్డిపోచతో సమానం అన్నారు. నాటి నుంచి నేటి వరకు బీసీలు రాజ్యాధికారానికి నోచుకోలేదన్నారు. చైతన్య వంతమైన గడ్డ మీద ఉన్నప్పటికీ ఐక్యత సాధించలేక పోతున్నామని తెలిపారు. అట్టడుగు వర్గాల నుంచి రాజ్యాధికారం సాధించిన రాష్ట్రం బీహార్ అని అన్నారు. అవకాశం వస్తే శక్తి సత్తా చాటగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళం బలహీన వర్గాల ప్రజలమన్నారు. నూటికి నూరు శాతం అణగారిన వర్గాలకు చెందిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. అందుకే ఉద్యమ సమయంలో దళితుడు మొదటి ముఖ్యమంత్రి అని కేసీఆర్ ప్రకటించారని.. కానీ అధికారం దగ్గరకు వచ్చిన తరువాత కేసీఆర్ ఎలా వ్యవహరించారు? ఎలా మాట తప్పారో తెలంగాణ సమాజం చూసిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement