Monday, April 29, 2024

RRR నుంచి మరో అప్‌డేట్

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR(రణం రౌద్రం రుధిరం)​ మూవీ నుంచి మరో అప్‌డేట్ త్వరలో రానుంది. ఏప్రిల్ 2న అజయ్ దేవగణ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేయనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఇటీవల రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన అల్లూరి సీతారామరాజు లుక్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. కాగా జూ.ఎన్టీఆర్, చెర్రీ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్‌ చిత్రం.. ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement