Tuesday, April 16, 2024

ఇకపై వాటికి చెక్… ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం !!

మామూలుగా మీడియాలో ఆ హీరో చేయబోతున్న నెక్స్ట్ సినిమా టైటిల్ ఇదే… ఈ టైటిల్ నే రిజిస్టర్ చేశారు అంటూ వార్తలు వస్తూ ఉంటాయి. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించక ముందే మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవి నిర్మాతలకు చాలా ఇబ్బందికరంగా మారుతుందట. ఈ నేపథ్యంలోనే ఇకనుంచి వాటికి బ్రేక్ వేయాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుందట. సాధారణంగా భవిష్యత్తులో రానున్న సినిమాలకు సంబంధించిన టైటిల్స్ ఇవే అంటూ ఫిలింఛాంబర్ నుంచి నెలవారి బులిటెన్ విడుదల అయ్యేది.

కానీ ఇక నుంచి అది రిలీజ్ కాదట. అలా రివిల్ చేసే ఆలోచనని ఫిలిం ఛాంబర్ విరమించుకుందట. ఇలా చెయ్యటం వల్ల అభిమానుల నుంచి నిర్మాతలు ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని వారు భావిస్తున్నారట. ఇక పై అధికారిక ప్రకటన తర్వాతే ఎటువంటి సమాచారం అయినా సరే మీడియాకు వెళ్లే విధంగా మార్పులు చెయ్యాలని ఆలోచనలో సినీ ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement