Wednesday, May 8, 2024

అదిరిందిగా ‘ఆదిపురుష్’ లిరిక‌ల్ మోష‌న్ పోస్ట‌ర్

రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ ఆదిపురుష్ ఈ సినిమాకు ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. రాముడిగా ప్ర‌భాస్, సీత‌గా కీర్తి సనన్ నటిస్తున్నారు.. జూన్ 16వ తేదిన తెలుగుతో స‌హా మొత్త ప‌ది బాష‌ల‌లో ఈ మూవీ విడుద‌ల కానుంది.. ఇక తాజాగా మేకర్స్‌ ఈ సినిమా నుంచి లిరికల్‌ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. నీ సాయం సాదా మేమున్నాం అంటూ విడుదలైన పాట గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా జై శ్రీరామ్‌ జై శ్రీరామ్‌ అంటూ చివర్లో బిట్ వే సినిమాపై హైప్ మ‌రింత‌గా పెంచింది.. మీరూ ఈ మోష‌న్ పోస్ట‌ర్ ను చూసేయండి..

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement