Monday, April 29, 2024

‘తనాజీ’ లానే ఆదిపురుష్ కూడా ??

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు సలార్ సినిమా చేస్తున్నాడు. అలాగే ఆదిపురుష్ సినిమా కూడా చేస్తున్నాడు. అయితే అది పురుష్ లో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నాడు. అలాగే కృతిసనన్ సీత గా కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ ను జరుపుకున్న ఈ చిత్రంకు సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ చిత్రాన్ని దర్శకుడు ఓం రౌత్ తనాజీ తరహాలో ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమాకు ఉపయోగించిన త్రీడీ టెక్నాలజీనే ఈ సినిమాకు కూడా ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ ప్రకారం దాని కన్నా బెటర్ ఎక్స్ పీరియన్స్ వస్తుందని కూడా తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ లో కూడా మంచి అవుట్ పుట్ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాను హిందీ మరియు తెలుగు భాషలలో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement