Friday, May 17, 2024

కరోనా రోగులకు అందని ఆరోగ్యశ్రీ…..

పైరవిలకే పెద్దపీట… సామాన్య ప్రజలు ప్రభుత్వశుపత్రుల్లోనే…
నెట్వర్క్ ఆసుపత్రల మాయాజాలం….
కావాలనే పడకలు, ఆక్సిజన్ బెడ్ల కొరత సృష్టిస్తున్న వైనం..
మామూళ్ల మత్తులో వైద్య ఆరోగ్య శాఖ….
నెట్వర్క్ ఆసుపత్రి పై పర్యవేక్షణ కరువు…
ఆరోగ్యశ్రీ పేరుతో కోట్ల వ్యాపారం…
జిల్లా కలెక్టర్ దృష్టి సారిస్తే వెలుగులోకి అక్రమాలు

గుంటూరు – కరోనా వచ్చిన ఏ రోగిఅప్పుల పాలవకుండా ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుంది కరోనా చికిత్స కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తాము ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఏడాది కరోనా రోగులకు ఇచ్చిన భరోసా… కానీ క్షేత్ర స్థాయిలో జిల్లా అధికారులు ముఖ్యమంత్రి ఇ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వారికి నచ్చిన ముడుపులు ఇచ్చే ఆసుపత్రులకు అనుమతులు మంజూరు చేసుకుంటూ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవకుండా కార్పొరేట్ శక్తులకు అండగా ఉంటున్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండు వారాల నుంచి జిల్లా వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తూ రోజుకు 1500 నుంచి రెండు వేల కేసులు నమోదు అవుతుంటే ప్రభుత్వ ఆసుపత్రుల నీ పడకలతో నిండిపోయి ప్రభుత్వ వైద్యులు రోగుల ప్రాణాలు కాపాడటానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు ప్రజలను పిప్పి చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ చికిత్స పొందేందుకు 19 ఆసుపత్రులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. అనుమతులు మంజూరు చేసిన నాటి నుంచి నేటి వరకు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్నాయి వాటిల్లో వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయి ఆక్సిజన్ బెడ్లు ఎన్ని ఉన్నాయి అనేది ఆరోగ్యశ్రీ ట్రస్ట్ గాని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గాని ఇంతవరకు బులెటిన్ విడుదల చేయలేదు. రాజకీయ నాయకులు,బడా వ్యాపారవేత్తలు ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు జిల్లా ఉన్నతాధికారులు వారి కుటుంబాలకు సంబంధించిన రోగులకు మాత్రమే పడకలు కేటాయించి ఆరోగ్య శ్రీ లో లో వచ్చే నిరుపేదలకు ఖాళీ లేవంటూ వెనక్కి తిరిగి పంపుతున్నారు. దీంతో చేసేదేమీ లేక ప్రభుత్వ వైద్యశాలలో ఆఖరి ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతూ ప్రజా ఆరోగ్య రక్షణ వ్యవస్థ ప్రమాదంలో మర్చిపోతున్న తరుణంలో కార్పొరేట్ శక్తులు సామాన్య ప్రజల వైపు చూడకుండా బడాబాబులకువైద్యం చేస్తూ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ ఆస్పత్రిలో పడకలు లేవంటూ ఆక్సిజన్ బెడ్లు లేవంటూ ఆస్పత్రి గడప తొక్కే సామాన్య నిరుపేద రోగుల పట్ల వివక్ష చూపిస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ను ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లోనూ ఆర్ టి పి సి ఆర్ చేయించుకుని పాజిటివ్ వచ్చినవారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేసి వారు ఏ ఆసుపత్రిలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు ఆ ఆసుపత్రికి పంపించే బాధ్యత జిల్లా వైద్య ఆరోగ్య శాఖది.కానీ వాస్తవంగా అలా జరగడం లేదు ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల పై జిల్లా అధికారులు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోందని విమర్శలు జిల్లావ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఆసుపత్రిలో జరుగుతున్న వైద్య తీరు వివరాలను తెలుసుకుంటే వెలుగులోకి మరిన్ని అక్రమాలు బయటకు వచ్చి సామాన్య నిరుపేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందని ప్రజలు కోరుకుంటున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement