Sunday, May 5, 2024

ధాన్యం కొనుగోలు యంత్రాన్ని ప్రారంభించిన మంత్రి..

మేడ్చల్‌ : తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి హమీ నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పూడూరు గ్రామంలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ఎంపిపి పద్మజగన్‌ రెడ్డి రిబ్బన్‌ కట్‌ చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి పాల్గొని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు మద్దతుగా గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యవసాయ సాగు కోసం ఉచితంగా 24 గంటల విద్యుత్‌ సరఫరా చేశారని మంత్రి మల్లారెడ్డి కొనియడారు. అంతేకాకుండా రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి సిఎం కేసిఆర్‌ ఎకరానికి రెండు పంటలకు కలిపి పెట్టుబడి కింద రూ. 10వేలు ఆర్థిక సహాయం చేస్తుందని మంత్రి రైతులకు గుర్తు చేశారు. రైతులు బాగుంటేనే రాజ్యం, రాష్ట్రం బాగుంటుందని సిఎం కేసిఆర్‌ బావించి ఇవన్నిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ఇటబోయిన బాబు యాదవ్‌, డిసిఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మధుకర్‌రె డ్డి, మేడ్చల్‌ నియోజకవర్గ తెరాస పార్టీ ఇన్‌చార్జ్‌ చామకూర మహేందర్‌రెడ్డి, మేడ్చల్‌, డబిల్‌పూర్‌ సోసైటిల చైర్మన్‌లు సద్ది సురేష్‌రెడ్డి, సింగిరెడ్డి రణదీప్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఎంపిటిసి రఘు, మాజీ సర్పంచ్‌లు నర్సింహారెడ్డి, మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, అప్పమ్మగారి జగన్‌రెడ్డి, మేడ్చల్‌ మాజీ ఉపసర్పంచ్‌ మర్రి నర్సింహారెడ్డి, సోసైటి సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement