Tuesday, March 26, 2024

అంబులెన్స్..​ వాహనదారులకు సూచనలు..

ఉమ్మడి మెదక్​ : కరోనా వైరస్​ సెకండ్​ వేవ్​ విజృంభిస్తున్న తరుణంలో అంబులెన్స్​లలో సౌకర్యాలన్నీ ఉండేలా చూసుకోవాలని జహీరాబాద్​ డీఎస్పీ శంకర్​ రాజ్​ సూచించారు. ఈ సందర్భంగా    జహీరాబాద్ పట్టణం లో ఉన్న అంబులెన్స్​  వాహనదారులతో మీటింగ్​ నిర్వహించి   ఆయన  ​   పలు సలహాలు,  సూచనలు చేశారు.  ఈ  సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ  ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో  పనిచేయాలని, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను డబ్బుల కోసం వేదించొద్దని సూచించారు.  ఎవరైనా  అపదలో ఉన్నట్లైతే  వారు  వెళ్లే గమ్యస్థానాల చేర్చేలా చూడాలని సూచించారు. అలాగే అత్యవసరం ఉందిలే  అంబులెన్స్ తప్పని సరిగా తీసుకెళ్తారని అనుకోని ప్రజలను  అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందిందని..అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు  చేస్తామన్నారు. అంబులెన్స్​ వాహనదారులను ఉద్దేశించి హెచ్చరించారు.  ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ప్రతి అంబులెన్స్​లో  ఆక్సిజన్ సిలెండర్  ఉండేలా చూసుకోవాలని, వాహనాలను    డ్రైవర్లు   అతివేగంగా తీసుకెళ్లకుండా  జాగ్రత్తగా  ప్రజల ప్రాణాలను  రక్షించేందుకు  వారు వెళ్లే చోటకు చేర్చేలా కృషి చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement