Monday, April 29, 2024

‘ఆకాశం నీ హద్దురా’ సినిమా మరో రికార్డ్

సుధా కొంగర దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం సూరరై పోట్రు. తెలుగులో ఈ సినిమా ఆకాశం నీ హద్దురా పేరుతో విడుదలైంది. ఇక ఈ సినిమాలో సూర్య సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. అయితే వరుస ఫ్లాప్ లతో ఉన్న సూర్య కు ఈ సినిమా మంచి సక్సెస్ ను ఇచ్చింది. ఇక ఈ సినిమా హక్కులను దక్కించుకున్న ఓటీటీ సంస్థ కూడా లాభాలను పొందింది. అంతేకాకుండా ఆస్కార్ బరిలో కూడా నిలిచింది. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలో సైతం ఈ సినిమాను ప్రదర్శించారు.

ఇక తాజాగా మరో ఘనతను ఈ చిత్రం సొంతం చేసుకుంది.షాంగై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పనోరమా విభాగంలో ఈచిత్రం చోటు దక్కించుకుంది. ఈ ఏడాది జూన్ 11 నుంచి జూన్ 20 వరకు ఈ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. ఐ.ఎమ్.డి.బి.లో ఎక్కువ రేటింగ్ పొందిన మూడవ సినిమాగా ఈ చిత్రం నిలిచింది. ఇక ఈ సినిమాను ఎయిర్ డెక్కన్ సీఈవో గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement