Wednesday, May 8, 2024

ఆహాలో మ‌సూద త‌మిళ వెర్ష‌న్.. పోస్ట‌ర్ రిలీజ్

మ‌సూద హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో తెర‌కెక్కింది ఈ చిత్రం. కాగా ఈ మూవీని రాహుల్ యాదవ్ నక్కా నిర్మించ‌గా.. సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. అలాంటి ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘ఆహా’లో ఆల్రెడీ ఆందుబాటులో ఉంది. ఇక ‘ఆహా’ తమిళంలో మసూద’ తమిళ్ వెర్షన్ ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. తిరువీర్ .. కావ్య .. సంగీత .. బాంధవి శ్రీధర్ .. శుభలేఖ సుధాకర్ ప్రధానమైన పాత్రలను పోషించారు. తక్కువ బడ్జెట్ లో .. తక్కువ పాత్రలతో .. తక్కువ సంభాషణలతో ప్రేక్షకులను భయపెట్టడం ఈ సినిమా ప్రత్యేకత. దెయ్యం చుట్టూనే కథ నడుస్తూ ఉంటుందిగానీ, దెయ్యం పాత్ర మాత్రం తెరపై కనిపించదు. కెమెరా పనితనం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్.

Advertisement

తాజా వార్తలు

Advertisement