Monday, April 29, 2024

యంగ్ టైగర్ ను పెళ్ళికి ఆహ్వానించిన అభిమాని

స్టార్ హీరోలకు అభిమానులు, అభిమాన సంఘాలు, అసోసియేషన్స్ ఇలా చాలా రకాలు ఉంటాయి. అందులో ఒక్కో సంఘానికి ఒక్కో ప్రెసిడెంట్ కూడా ఉంటారు. అయితే తాజాగా ఎన్టీఆర్ ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ వైడ్ అసోసియేషన్ కన్వీనర్ భాస్కర్ చౌదరి కలిశారు. తన కొడుకు భాను పెళ్లికి ఎన్టీఆర్ ను ఆహ్వానించేందుకు పెళ్లి కార్డు పట్టుకొని కుటుంబసమేతంగా భాస్కర్ చౌదరి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ టీ షర్ట్, క్యాజువల్ ప్యాంటు లో మాస్కు పెట్టుకొని కనిపించారు. అది చూసిన అభిమానులు చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ను బయటకు చూసినందుకు ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చెయ్యబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement