Monday, May 13, 2024

21 ఏళ్ల బద్రి – పవన్ తో ఉన్న ఫొటో పోస్ట్ చేసిన రేణు

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం బద్రి. ఈ సినిమా నేటికీ సరిగ్గా 21 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు పూరి జగన్నాథ్ అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్ లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తోనే కెరీర్ ను ప్రారంభించిన పూరీ ఈ సినిమ హిట్ తరవాత వెనక్కి తిరిగి చూడలేదు.

ఇక ఈ సినిమాలో పవన్ సరసన అమీషా పటేల్, మాజీ భార్య రేణు దేశాయ్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా రేణు పనిచేశారు. కాగా ఈ సినిమా 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఫోటోను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.ఈ సినిమాలో హే చికితా అంటూ సాగే సాంగ్ లో గన్ పట్టుకొని ఉన్న పవన్ ముందు తాను ఉన్న ఫోటోను షేర్ చేసి చేసింది రేణు దేశాయ్. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.

https://www.instagram.com/p/CN4LaX0hRtB/?igshid=13hg8wg94jm1q

Advertisement

తాజా వార్తలు

Advertisement