Friday, May 17, 2024

చిత్తూరు జిల్లాలో కరోనా సునామీ – ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న జనం

  • జిల్లాలో కరోనా విలయ తాండవం
  • రోగులతో కిక్కిరిసి పోతున్న ఆసుపత్రి ఆవరణలు
  • బెడ్ ల కోసం రోగుల పడిగాపులు
  • అత్యవసర కేసుల కు ప్రాధాన్యం
  • చిత్తూరు, తిరుపతి నగరాల్లో ప్రత్యామ్నాయాలపై అధికారుల దృష్టి
  • ఓ పి లు రద్దుచేసిన… తగ్గని రద్దీ
  • ప్రధాన కేంద్రాల్లో పడకల పెంపు అన్ని బ్లాకు ల్లోనూ కోవిడ్ చికిత్సలు
  • ఏడాదిలో లక్ష దాటిన కేసులు…… 1000 కి చేరువలో మరణాలు

చిత్తూరు ప్రతినిధి, -రోజురోజుకు ముంచుకొస్తున్న కరోనా మహమ్మారి జిల్లా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది. ఒంట్లో ఎలాంటి అస్వస్థతకు గురైన కరోనా ఏమో అనే సందేహం తో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు .మరోవైపు జిల్లాలో రక్షణ చర్యల్లో భాగంగా అధికారులు నిర్దేశించిన కేంద్రాలు రోగులతో కిక్కిరిసి పోతున్నాయి.దీంతో రోగులు బెడ్ ల కోసం పడిగాపులు తప్పడం లేదు ఒకవైపు అత్యవసర కేసులకు ప్రాధాన్యత ఇస్తుండడంతో తిరుపతి, చిత్తూరు నగరాల్లో ప్రత్యామ్నాయాలపై అధికారులు దృష్టిసారించారు. ఇప్పటికే స్విమ్స్ లతోపాటు మరికొన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒ పి సేవలు రద్దు చేశారు. అయినా రోగులు మాత్రం బారులు తీరుతున్నారు. తిరుపతి ,చిత్తూరు ,మదనపల్లి డివిజన్ ల పరిధిలో ప్రత్యేక కేంద్రాలు కల్పించి అన్ని బ్లాకు ల్లోనూ చికిత్సలు చేస్తున్నప్పటికీ రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఒక రోజులో జిల్లాలో వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతూ కరోనా విలయ తాండవం చేస్తుంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఒక ఏడాదిలో లక్షకు పైగా కేసులు నమోదు కావడం… అందులో మరణాలు వెయ్యికి చేరువ అవుతుండడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుండగా రోజుకు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతానికి కోవిడ్ బాధితులకు ఉచిత వైద్య సేవలు అందించేది తిరుపతి, చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలోనే కావడంతో జిల్లా వ్యాప్తంగా రోజుకు వంద ల మంది కరోనా బాధితులు వైద్యం కోసం ఆస్పత్రులకు తరలివస్తున్నారు. అంతమందికి ఆసుపత్రిలో బెడ్ ల సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో బాధితులు నరకయాతన అనుభవిస్తున్నారు. అంతమందికి బెడ్ సమకూర్చి వైద్యం అందించలేక ఆసుపత్రి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వైద్యం కోసం వచ్చే కరోనా బాధితులను కాదనకుండా ఆసుపత్రిలో చేర్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అత్యవసర కండిషన్ లో ఉన్న వారిని మాత్రమే అడ్మిషన్ ఇస్తున్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్ పై చికిత్స చేయాల్సిన అవసరం ఉన్న బాధితులకు మాత్రమే ఇస్తున్నారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న బాధితులను ఇంటి దగ్గరే ఉండి మందులు వాడాలి అని చెప్పి పంపించేస్తున్నారు. ప్రాణభయంతో వణికిపోతున్న కొంతమంది రోగులు ఆస్పత్రిలో అడ్మిషన్ల కోసం అక్కడే పడిగాపులు కాస్తూ.. ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఫోన్లు చేస్తూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.బెడ్ లు లేకపోవడంతో సాధారణ వ్యాధి గ్రస్తులను బలవంతంగా డిశ్చార్జ్ చేసి డివిజన్ స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిణీ చేస్తున్నారు. ఇలా ఖాళీ చేస్తున్నా మంచాలను సీరియస్ గా ఉన్నా కరోనా బాధితులకు కేటాయిస్తున్నారు. ఇలా గత నెల రోజుల్లో 150 నుంచి 500 కరోనా బాధితుల కోసం బెడ్ లు ఏర్పాటు చేశారు. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు నగరపాలక పరిధిలో పలు ప్రభుత్వ భవనాలను ఆధీనంలోకి తీసుకొని వాటిలో కరోనా రోగులకు వైద్యం అందించే దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఒకరోజులో వందల సంఖ్యలో వస్తున్నా రోగులకు బెడ్లు సమకూర్చడం అధికార యంత్రాంగానికి ఇబ్బందికరంగా మారింది. రెండు మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాల్లో సైతం బెడ్ లు కరోనా బాధితులకు కేటాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో గతంలో మాదిరిగా ఆసుపత్రిలోనే అన్ని వార్డుల్లో క్వారం టైన్ లు గా మారిపోతున్నాయి. ఇప్పటికే ఓ పి లు.. సాధారణ పూర్తిస్థాయిలో రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం అత్యవసర కేసులోనే తిరుపతి నగరం స్విమ్స్ లో చూస్తున్నారు.

కలవరపడుతున్న‌ కోవిడ్ మరణాలు…
జిల్లావ్యాప్తంగా వందల సంఖ్యలో పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య కలవరపెడుతున్న వేల వాటి ద్వారా సంభవిస్తున్న మరణాలను చూసి సామాన్య ప్రజానీకం కలవరపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో బెడ్ దొరకడమే ఘగనంగా మారింది. అడ్మిషన్లు దొరికితే చికిత్స పొందుతున్నా కరోనా బాధితులు రోజు పదుల సంఖ్యలో పిట్టల్లా రాలిపోతున్నారు. ఇటీవల సంభవిస్తున్న కరోనా రెండు దశలో మరణాలపై వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంట వ్యవధిలోనే ఒకరిద్దరు చొప్పున మరనిస్తుండటం తో మార్చురీ వద్ద సైతం శవాలతో నిండిపోతుంది ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాల ఆక్రందనలు హృదయవిదారకంగా ఉంటున్నాయి .ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య సిబ్బంది సైతం కోవిడ్ బారిన పడుతున్నారు. ఏప్రిల్ నెలలో పది మందికి పైగా డాక్టర్లకు, వైరస్ బారిన పడగా పలువురు ఉద్యోగులకు కూడా సోకింది ప్రస్తుతం వారు క్వారంటైన్ లో ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. దీంతో వార్డులో ఉన్న బాధితులకు సరైన సేవలు అందడం లేదు. ఇందుకు ఉదాహరణగా ఇటీవల తిరుపతికి లో కేంద్రం లో ఒక సెంటర్లో ఒక వ్యక్తి కరోనా తో మరణించి 10 గంటలు కావస్తున్నా అతడిని అక్కడి సిబ్బంది తరలించ లేదని లేని పరిస్థితి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది

వ్యాక్సినేషన్ కోసం….
జిల్లా వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఉదృతంగా ఉండడంతో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది కరీనా నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం ఆసుపత్రిలో వారియర్ పడిగాపులు కాస్తున్నారు. వాస్తవానికి 16 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా చాలామంది వైద్య ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోలేదు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఉన్నత అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ నిన్ను ఎలా పడుతున్నారు అందరికీ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేకపోవడంతో పలు ప్రాంతాల్లో టోకెన్లు జారీ చేశారు .ఇంకా అనేకమంది జూనియర్ సిబ్బందికి నర్సులకు పారామెడికల్ సిబ్బంది కి టీకా అందలేదు ప్రభుత్వం నుంచి టీకాలు రావాల్సి ఉంది .అంటూ పంపించే చేస్తున్నారని పలు ప్రాంతాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వం ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన వారికి సైతం వ్యాక్సిన్లు వేసుకోవాల్సిందే గా ప్రకటించింది.

గత ఏడాది మార్చి నుంచి…..
జిల్లాలో గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 19 వరకు నమోదైన కరోనా కేసులు 1,02,682 మరణాలు 927 గా ఉన్నాయి.. వివరాలు…
-10 సంవత్సరాల లోపు వారికి 4400 కేసులు 3 మరణాలు

  • 10 నుంచి 20 సంవత్సరాల లోపు వారికి 7672 కేసులు 2 మరణాలు
  • 21 నుంచి 30 లోపు 25,135 కేసులు , 15 మరణాలు
  • 31 నుంచి 40 లోపు వారిలో లో 21,281 కేసులు 43 మరణాలు
  • 41 నుంచి 50 లోపు 18,695 కేసులు, 115 మరణాలు
  • 51 నుంచి 60 సంవత్సరాలు లోపు 14368 కేసులు ,255 మరణాలు
  • 61 నుంచి 70 సంవత్సరాల లోపు 7582 కేసులు 273 మరణాలు
    -71 నుంచి 80 సంవత్సరాల లోపు 2905 కేసులు 173 మరణాలు
  • 80 సంవత్సరాలు ఆపైన 644 కేసులు 48 మరణాలు
Advertisement

తాజా వార్తలు

Advertisement