Sunday, May 5, 2024

‘పోకిరి’కి 15 ఏళ్ళు

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ పోకిరి. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గోవా బ్యూటీ ఇలియానా నటించింది. ఇక ఈ సినిమా టైటిల్ గురించి చెప్పగానే ఇప్పటికే మహేష్ అభిమానులు కాలర్ ఎగరేస్తూ ఉంటారు. అలాగే డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది.

అప్పట్లోనే 40 కోట్ల షేర్లను రాబట్టి దక్షిణాదిలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కాగా నేటికీ ఈ సినిమా రిలీజై 15 ఏళ్లు. ఈ నేపథ్యంలోనే మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement