Monday, April 29, 2024

హైదరాబాద్‌లో అమెరికా వీసాలకు బ్రేక్

కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో అమెరికా వీసా ప్రక్రియలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ జనరల్ ప్రకటించింది. నాన్‌ ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం మే 3 నుంచి జరగాల్సిన అన్ని ఇంటర్వ్యూలు, డ్రాప్‌బాక్స్‌ ప్రక్రియలను నిలిపివేసింది. వీసా ప్రక్రియను తిరిగి ఎప్పుడు ఆరంభించేది తరువాత ప్రకటిస్తామని పేర్కొంది. అమెరికా సిటిజన్‌ సర్వీసులకు సంబంధించిన ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను ఏప్రిల్ 27 నుంచే నిలిపివేసినట్లు వెల్లడించింది.

మరోవైపు అమెరికా పౌరుల అత్యవసర సేవలు, వీసా అపాయింట్‌మెంట్లను స్థానిక పరిస్థితులు అనుకూలించిన మేరకు అనుమతిస్తామని అమెరికా కాన్సులేట్ జనరల్ తెలిపింది. అత్యవసరాలపై ఇప్పటికే తీసుకున్న ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను సాధ్యమైనంత మేరకు అనుమతిస్తామని పేర్కొంది. కాగా హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు సేవలను అందిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement