Thursday, April 25, 2024

గనుల వద్ద కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన..

కాసిపేట : ఒక వైపు కరోనా నానాటికి తన విశ్వరూపాన్ని ప్రజలపై చూపెడుతున్నప్పటికి, ప్రజలు ఇంకా నిర్లక్ష ధోరణిని వీడడం లేదు. నాకు ఏమవుతుందనే భావనతోనే తమకు తెలియకుండా కరోనా పాజిటివ్‌ బారినపడడమే కాకుండా ఇతరులకు సైతం వ్యాపింప చేస్తున్నారనే ఇంగితం లేకపోవడం బాధాకరం. ఈ క్రమంలోనే సింగరేణి గనుల వద్ద అధికారులు మైక్‌లు పెట్టి చెపుతున్నా, కోవిడ్‌ నిబంధనలపై ప్రచారం చేస్తున్నప్పటికి భాద్యత రహితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. సమిష్టిగా విధులు నిర్వహించే పని స్థలాల మద్య, ఒకరికంటే ఎక్కువ మంది కార్మికులు కలిసి విధులు నిర్వహించే పని విధానాలు ఉన్నాయన్న విషయం తెలిసి కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక గనికి పలు ప్రాంతాల నుండి వచ్చి గనిలో విధులు నిర్వహిస్తారని, ఎవరికి వ్యాధి వుందో ముందుగా తెలియక పోవడంతో పలు ఆందోళనల మధ్య డ్యూటీలు చేయాల్సి వస్తున్నదని కార్మికులు తెలిపారు. మూడు రోజులు వరుసగా విధులకు గైహజరయ్యే కార్మికులు తప్పని సరిగా కరోనా వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహించుకోవాలని, నెగిటివ్‌ అని తేలితేనే డ్యూటీలకు అనుమతిచ్చే నిబంధనలు పెట్టిన అధికారులు, గనులపై నామమాత్రపు రక్షణ చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారని, కోవిడ్‌ నిబంధనలు మరింత కఠినంగా అమలు జరిగేలా ఆయా గనులు, డిపార్డ్‌మెంట్‌ల అధికారులు చర్యలు చేపట్టాలని మెజార్టి కార్మికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement