Saturday, May 4, 2024

సిద్ధమవుతోన్న ‘ఆచార్య’

ఆచార్య సిద్ధమవుతున్నాడని మెసేజ్ పోస్ట్ చేశాడు దర్శకుడు కొరటాల శివ.   ‘ఆచార్య’లో మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సిద్ధ అనే ఓ పవర్‌పుల్‌ పాత్రలో కనిపించనున్నాడు. కొరటాల శివ షేర్‌ చేసిన ఫొటోలో చరణ్‌ వెనుక నుంచి కనిపిస్తున్నాడు. రగ్డ్‌ లుక్‌లో చరణ్‌ కనిపిస్తుండగా, చిరంజీవి చరణ్‌ భుజంపై చేయి వేసుకుని ఉన్నాడు. ఈ ఫొటోపై స్పందించిన రామ్‌చరణ్‌ ‘కామ్రేడ్‌ మూమెంట్‌..’ఆచార్య’ సెట్‌లో ప్రతి క్షణాన్ని చిరంజీవిగారితో, కొరటాలగారితో ఎంజాయ్‌ చేస్తున్నాను’ అన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మాతలు. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ ఏడాది మే 13న ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement