Thursday, April 25, 2024

ఏప్రిల్ 2న ‘వైల్డ్ డాగ్’

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటిస్తోన్న చిత్రం వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న చిత్రం ఇంది. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న రిలీజ్ చేయనున్నారు.   నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో స‌యామీ ఖేర్ క‌నిపించ‌నున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  సినిమా హైదరాబాద్‌ సహా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మ‌నాలీలో ఈ సినిమా షూటింగ్‌  జరుపుకుంది. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజ‌య్ వ‌ర్మ‌గా నాగార్జున ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని విభిన్న త‌ర‌హా యాక్షన్ రోల్ చేస్తున్నారు. క్రిమిన‌ల్స్‌ను నిర్దాక్షిణంగా డీల్ చేసే విధానం వ‌ల్ల సినిమాలో ఆయ‌న‌ను ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారు. కిర‌ణ్ కుమార్ సంభాష‌ణ‌లు రాస్తుండ‌గా, షానీల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement