Sunday, April 28, 2024

శీలో రక్షితి రక్షితః…. నగ్నంగా సంపూర్ణేష్ బాబు

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు సంపూర్ణేష్ బాబు. అయితే సంపూర్ణేష్ బాబు వెరైటీ కథలతో ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా క్యాలీఫ్లవర్ అనే డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఆర్కె మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి గతంలో విడుదలైన లుక్స్ ప్రేక్షకులను మంచిగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో శాసనసభ ఎదుట నగ్నంగా క్యాలీఫ్లవర్ సాక్షిగా శీలో రక్షితి రక్షితః అనే క్యాప్షన్ తో సంపూర్ణేష్ బాబు నిలుచుకున్నాడు. అయితే ఈ ఫోటోలో సంపూర్ణేష్ బాబు నగ్నంగా నిలిచోవటం హైలెట్ గా నిలుస్తోంది. అలాగే సినిమాపై హైప్ ని క్రియేట్ చేస్తుంది. మరి ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement