Saturday, April 20, 2024

తెలంగాణలో కొత్తగా 848 కరోనా కేసులు

తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 848 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా కారణంగా 6 మంది మృతిచెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1114 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం…మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,26,085 కు చేరగా.. రికవరీ కేసులు 6,09,947 కు చేరింది. అలాగే కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,684 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 12,454 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement