Monday, May 20, 2024

భయంతో పాటు నవ్విస్తోన్న ‘రూహి’ చిత్ర ట్రైలర్

రూహి చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేసిందా చిత్ర యూనిట్. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తోన్న తొలి థ్రిల్లర్ చిత్రం ఇది.ఈ  చిత్రంలో జాన్వీతో పాటు రాజ్ కుమార్ రావు ప్ర‌ధాన పాత్ర పోషించారు. మార్చి 11న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా, ఇందులో హార్ర‌ర్, కామెడీ స‌న్నివేశాలు క‌నిపిస్తున్నాయి.  ద‌ర్శ‌కుడు హార్దిక్ మెహతా ఈ సినిమాతో ప్రేక్ష‌కుల‌ని భ‌య‌పెట్టించ‌డంతో పాటు న‌వ్వించ‌నున్నాడు. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం స్త్రీ.  ఈ సినిమాకు సీక్వెల్ గా రూహి ని తెరకెక్కిస్తున్నట్లు టాక్. గతంలో రూహీ అఫ్జానా అనే పేరుని మూవీకి ఫిక్స్ చేయ‌గా, ఇప్పుడు రుహిగా మార్చారు. గత ఏడాది రూహీ విడుదల కావాల్సి ఉన్న క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు మార్చిలో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement