Monday, April 29, 2024

‘బిగ్‌బాస్-5’లో టాప్ సింగర్

తెలుగులో ‘బిగ్ బాస్’షోకు క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందుకే సీజన్ సీజన్‌కు ఓటింగులు, రేటింగులు కూడా పెరుగుతున్నాయి. తొలి సీజన్‌కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. రెండో సీజన్‌‌ను నాని హోస్ట్ చేశాడు. ఇక మూడు, నాలుగు సీజన్‌లకు నాగార్జున వ్యాఖ్యాతగా చేశాడు. త్వరలో వచ్చే ఐదో సీజన్‌కు కూడా నాగార్జునే హోస్టుగా రానున్నాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ‘బిగ్‌బాస్-5’కు స్టార్ సింగర్ రాబోతున్నాడని తెలుస్తోంది. టాలీవుడ్ గాయకుడు హేమచంద్ర వచ్చే సీజన్‌లో ఓ కంటెస్టెంట్‌గా ఎంపికయ్యాడని, ఈ మేరకు నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. అయితే గతంలోనూ హేమచంద్రకు బిగ్‌బాస్ అవకాశాలు రాగా అతడు సున్నితంగా తిరస్కరించాడు. ఈసారి మాత్రం అవకాశం వదులుకోకూడదని ఫిక్సయ్యాడట. ఇందులో నిజం ఎంతో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే. మరోవైపు యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ కూడా ‘బిగ్‌బాస్-5’లోకి ఎంట్రీ ఇస్తున్నాడని టాక్ నడుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement