Thursday, May 9, 2024

పోల్ యాప్ కోసం’రేసుగుర్రం’ సీన్

మలయాళంలో కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఫుల్ క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ సినిమా విడుద‌లైంది అంటే మ‌ల‌యాళ ప్రేక్ష‌కులు కూడా పండ‌గ చేసుకుంటారు. కేర‌ళ‌లో బ‌న్నీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ని చూసి ఆశ్చ‌ర్య‌పోయిన పోలీసులు ఓ మంచి ప‌నికి ఆయ‌న సినిమాలోని ఓ సీన్ వాడుకున్నారు. ఆప‌ద స‌మ‌యంలో ఉన్న‌ప్పుడు పోల్ యాప్‌ను ఉప‌యోగించాల‌ని తెలియ‌జేసిన వారు రేసుగుర్రం సినిమాలోని సీన్‌ను జ‌త చేశారు. కేర‌ళ పోలీసుల తెలివి తేట‌ల‌కు నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ పుష్ప అనే సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతుంది. ఈ సినిమా ఆగ‌స్ట్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేయ‌నున్నాడ‌ని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement