Thursday, May 9, 2024

ఉప్పెన చిత్రాన్ని కుటుంబంతో కలిసి చూసిన ‘బాలయ్య’

తన కుటుంబంతో కలిసి ఉప్పెన చిత్రాన్ని చూశారు హీరో నందమూరి బాలకృష్ణ. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్..కృతిశెట్టి ప్రధాన పాత్రలలో బుచ్చిబాబు సాన రూపొందించారు.  వారం రోజుల్లో 70 కోట్లు గ్రాస్ వ‌సూళ్ళు సాధించింద‌ని రీసెంట్‌గా మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌డంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే ఈ సినిమాని చూసిన ప్ర‌తి ఒక్క‌రు చిత్రంపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఫిబ్ర‌వరి 12న విడుద‌లైన ఉప్పెన సినిమాను తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ త‌న కుటుంబంతో క‌లిసి వీక్షించారు. సినిమా చాలా బాగుంద‌ని చిత్ర బృందంపై ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ‌తో బుచ్చిబాబు దిగిన ఫొటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఉప్పెన చిత్రాన్ని  మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్  నిర్మించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement