Sunday, April 28, 2024

పొట్టి ఫ్రాక్ తో బాత్ టబ్ లో..

బాత్ టబ్ లో ఫొటో షూట్ చేసింది హీరోయిన్ ఈషారెబ్బా. కాలేజ్ డేస్ లో మోడల్ గా పనిచేసి ఆ తర్వాత వెండితెరపై సందడి చేసిందీ వరంగల్ బ్యూటీ. చిన్న పాత్రలు చేస్తూ లీడ్ రోల్స్ చేసే స్థాయికి ఎదిగి పలు చిత్రాలతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలుకరిస్తోంది.  ఈ భామ ప్ర‌స్తుతం తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ చిత్రంలో న‌టిస్తోండ‌గా..త‌మిళంలో ఓ సినిమా చేస్తోంది. ఈ బ్యూటీ తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొంది. యెల్లో మినీ డ్రెస్‌లో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. మ‌త్తెక్కించే చూపుతో, మంత్ర‌ముగ్దుల్ని చేసే అందంతో బాత్‌ట‌బ్‌లో ఉండి షూట్‌లో పాల్గొందీ భామ‌. ఈషారెబ్బా లేటెస్ట్ ఫొటో షూట్ స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement