Friday, May 17, 2024

నిన్ను మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నా..’నమ్రత’

16ఏళ్లు సులభంగా గడిచిపోయాయి అంటున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత. టాలీవుడ్‌లోని అత్యంత అన్యోన్యమైన జంటగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు మహేష్ బాబు, నమ్రత. ఈ రోజు (బుధవారం) వీరి వివాహ వార్షికోత్సవం.ఈ సందర్భంగా నమత్ర సోషల్ మీడియా ద్వారా మహేష్‌కు విషెస్ చెప్పారు. `16 ఏళ్లు చాలా సులభంగా గడిచిపోయాయి. బలమైన ప్రేమ, నమ్మకం, విశ్వాసం కలయికతో మన వైవాహిక జీవితం రూపుదిద్దుకుంది. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మహేష్ బాబు. నిన్ను మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నానని నమ్రత కామెంట్ చేశారు. మహేష్‌ను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement