Saturday, May 18, 2024

‘నిన్నిలా నిన్నిలా’ నుండి మెలోడీ సాంగ్

నిన్నిలా నిన్నిలా చిత్రం నుండి మెలోడి సాంగ్ ని రిలీజ్ చేశారు.   డిఫ‌రెంట్ ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ జ‌ర్నీని మా సినిమాలో ఫీల్ అవుతార‌ని అంటున్నారు ‘నిన్నిలా నిన్నిలా’ టీమ్‌. అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్‌ల‌‌పై బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అని.ఐ.వి.శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా ‘‘ నా కోసం రేయె కొత్తగా పూసెనే.. నా దేశం పేరే మెలకువై మెరిసెనె..’’  అనే ల‌వ్ మెలోడిని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ మెలోడీని శ్రీమ‌ణి రాయ‌గా, రాజేశ్ మురుగేశ‌న్, విజ‌య్ ఏసుదాస్ ఆల‌పించారు. ఈ చిత్రానికి రాజేశ్ మురుగేశ‌న్ సంగీత సారథ్యం వ‌హించారు.  ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వ‌ర‌లోనే అనౌన్స్ చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement