Thursday, May 9, 2024

నా రహస్య ఫ్రెండ్..’సమంత’

స్టార్ హీరోయిన్ సమంత రహస్య స్నేహితుడిని పరిచయం చేశారు. దర్శకుడు విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కతున్న సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు చెన్నై వెళ్లారామె. స్వ‌స్థ‌లాన్ని  చూడ‌గానే స‌మంత‌కు గ‌త స్మృతులు గుర్తుకు వ‌చ్చాయి. దీంతో వెంట‌నే కొండ ప్రాంతాన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. స‌మంత ఇంటిపై నుండి చూస్తే ఈ టెర్రాస్ క‌నిపిస్తుంద‌ట‌. దాంతో స్నేహం చేసిన సామ్ దానిని ఒక ర‌హ‌స్య స్నేహితుడిగా తెలిపారు. నేను ఎదుగుతున్న స‌మ‌యంలో టెర్రాస్‌పై నుండి కొండ క‌నిపించేది. దానికి నా గురించి చాలా తెలుసు. ప‌రీక్షా స‌మ‌యంలో నా త‌ప‌న‌.. దేవుళ్ళకు మొక్కిన మొక్కులు, ఫ‌స్ట్ ల‌వ్, హార్ట్ బ్రేక్ అన్నీ ఆ కొండ‌కు తెలుసు. నా స్నేహితుల మ‌ర‌ణం.. క‌న్నీటి వీడ్కోలు కూడా కొండకు తెలుస‌ని చెప్పారామె. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు విఘ్నేష్ శివ‌న్ చిత్రంతో పాటు గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కిస్తున్న శాకుంత‌లం అనే చిత్రంతో బిజీగా ఉంది. శాకుంత‌లం చిత్ర షూటింగ్ మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానుంది. చిత్రంలో స‌మంత శ‌కుంత‌ల‌గా క‌నిపించి సంద‌డి చేయ‌నుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement