Friday, May 10, 2024

‘అరణ్య’ ట్రైలర్ మరో రెండు రోజుల్లో

హీరో రానా నటిస్తోన్న అరణ్య చిత్రం ట్రైలర్ మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ప్రభుసాల్మన్ డైరెక్షన్ లో రూపొందుతోంది. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విష్ణువిశాల్‌, జోయాహుస్సేన్‌ ప్రధాన పాత్రల్ని పోషించారు. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడిన ఈసినిమాను మార్చి 26న విడుదలచేయబోతున్నట్లు  ఇంత‌క‌ముందే ప్ర‌క‌టించారు. అయితే తాజాగా ట్రైల‌ర్ రిలీజ్ ఎప్పుడు విడుద‌ల కానుందో తెలియ‌జేశారు. రెండు రోజుల‌లో అర‌ణ్య ట్రైల‌ర్ మిమ్మ‌ల్ని అలరించేందుకు రాబోతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ‘కార్పొరేట్‌ సంస్థల కుట్రలపై పోరాడే ఓ వ్యక్తి కథ అర‌ణ్య కాగా, ఇందులో ఇరవైఐదేళ్లుగా అరణ్యంలో జీవించే వ్యక్తిగా రానా పాత్ర రియలిస్టిక్‌గా ఉంటుంది. పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలనను చర్చిస్తూ సందేశాత్మకంగా ఈ సినిమా సాగుతుంది’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి  శంతను మొయిత్రా సంగీతం అందిస్తున్నారు. చిత్రానికి సంబంధించి విడుద‌లైన చిత్రాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. రంగ్ దే, అర‌ణ్య చిత్రాలు ఒకే రోజు థియేట‌ర్‌లో విడుద‌ల కానుండ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement