Monday, May 6, 2024

‘నాగబాబు’ న్యూ లుక్

కొత్త లుక్ లో కనిపించారు మెగా బ్రదర్ నాగబాబు. సినిమా నటుల్లో సింహం అనే పదం హీరో బాలకృష్ణకే వర్తిస్తుంది. కానీ ఇప్పుడు నాగబాబు కూడా ఆ జాబితాలో చేరారా అనిపిస్తుంది ఆ టాటూ చూస్తే. కొత్త మేకోవర్ చూస్తే వావ్ అనాల్సిందే. ఇంతలో ఎంత మారిపోయాడు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు ఆడియన్స్. తాజాగా ట్విట్టర్ లో ఈయన పోస్ట్ చేసిన ఫోటోతో పాటు అందులో రాసిన పదాలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. సింహం ఎందుకు రాజు అవుతుందనేది చెప్పుకొచ్చాడు నాగబాబు. ఏదైనా సినిమా కోసం ఈ గెటప్ లోకి వచ్చాడా లేదంటే ఈ గెటప్ చూపించి అవకాశాలు దక్కించుకుందాం అనుకుంటున్నాడా.. అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement