Thursday, May 16, 2024

‘జాక్వెలిన్’ ఇంటి అద్దె లక్షల్లో

సొంతఇల్లు లేని వారికి ఏ ప్లాట్ నచ్చితే అందులో ఉండే ఛాన్స్ ఉంటుంది. అద్దె అంటే మహా అయితే వేల రూపాయల్లో కాదు లక్షల్లో కూడా ఉంటున్నాయి. అది కూడా ముంబయిలోని అతి ఖరీదైన ఏరియా బాంద్రాలో అయితే వేరే చెప్పనవసరం లేదు.త‌మ‌కు ఏదైనా ఫ్లాట్ న‌చ్చితే ఎంత అద్దె అయినా  క‌డుతూ ఉండే సెల‌బ్రిటీలు కూడా ఉన్నారు. ఆ లిస్టులో ఉన్న వారిలో శ్రీలంక‌న్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఒక‌రు.ఈ బాలీవుడ్ భామ త‌న‌కిష్ట‌మైన  ఇంట్లో..భారీ మొత్తంలో అద్దె కట్టి మ‌రీ ఉంటోంద‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి.  బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక‌చోప్రాకు సంబంధించిన భ‌వంతిలో నాలుగు, ఐదో అంతస్థుల‌ను మూడేళ్ల‌కు లీజ్‌కు తీసుకుంద‌ట జాక్వెలిన్‌. ప్రియాంకా ఫ్లాట్‌ త‌న‌కు బాగా న‌చ్చ‌డంతో నెల‌కు రూ.6.78 ల‌క్ష‌లు అద్దె చెల్లిస్తుంద‌న్న వార్త ఇపుడు బీటౌన్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మొత్తానికి కేవ‌లం రెంట్ కోసం జాక్వెలిన్ ఇంత పెద్ద మొత్తంలో డ‌బ్బు వెచ్చించ‌డం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement