Saturday, April 27, 2024

‘గని’ సెట్ లో కన్నడ స్టార్ హీరో

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ త‌న  10వ సినిమాగా బాక్సింగ్ డ్రామాను చేస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా గ‌ని అనే టైటిల్‌తో రూపొందుతుంది.   తమన్.. ‘గని’కి   అద్భుతమైన నేపథ్య సంగీతం అందిస్తున్నారు.ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. కన్నడ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 30న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ జ‌రుపుకుంటుండ‌గా, క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర టీంతో క‌లిసారు. ఆయ‌నకు చిత్ర బృందం పుష్ప‌గుచ్ఛం ఇచ్చి స్వాగ‌తం ప‌లికింది. ఉపేంద్ర ప‌వర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement