Thursday, May 2, 2024

‘గంగూబాయి’ టీజర్ పై ప్రశంసలు

ప్రముఖ  బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో లో తెరకెక్కుతోన్న చిత్రం గంగూబాయి. హీరోయిన్ గా ఆలియాభట్ నటిస్తోంది. ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయింది. సెక్స్ వర్కర్ గంగూబాయి పాత్రలో ఆలియా అద్భుతంగా కనిపించింది. కాగా ఈ టీజర్ పై పలువరు ప్రశంసలు కురిపించారు.  ఇప్పటికే ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ టీజర్‌ను ప్రశంసించారు. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, దర్శకధీరుడు రాజమౌళి కూడా ఈ టీజర్‌ను ట్విటర్ ద్వారా ప్రశంసించారు. టీజర్ అద్భుతంగా ఉంది సంజయ్ సర్..ఆలియా స్క్రీన్ ప్రజెన్స్ చాలా గొప్పగా ఉంది. ఈ చిత్రం విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని రామ్ చరణ్ చెప్పాడు. ఆయన ప్రశంసలకు ఆలియా ధ్యాంక్స్ తెలపిింది. రాజమౌళి ఈ టీజర్ పై స్పందించాడు. గంగూబాయిగా ఆలియా భట్ అద్భుతంగా కుదిరిందని..వెండితెరపై సంజయ్ లీలా భన్సాలీ వర్క్ చేసేందుకు ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement