Sunday, May 26, 2024

ఆహా వెబ్ సిరీస్ లో ‘ప్రియదర్శి’

కమెడియన్..నటుడు ప్రియదర్శితో ఓ వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తోందట ప్రముఖ ఓటీటీసంస్థ ఆహా. వినూత్న కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది ఆహా. హిట్టయిన సినిమాల డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంటున్న ఆహా వాటితో ప్రేక్షకులకు పసందైన వినోదం అందిస్తోంది.   రానున్న రోజుల‌లో ప‌లు బిగ్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నా ఆహా ప్ర‌ముఖ న‌టుడు ప్రియ‌ద‌ర్శితో క‌లిసి ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తుంద‌ట‌. ఈ వెబ్ సిరీస్ గ్యాంగ్ స్టార్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుండ‌గా, ఇందులో ప‌లువురు ప్ర‌ముఖ స్టార్ న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.భారీ బ‌డ్జెట్‌తో ఈ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుండ‌గా, త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లు పెట్ట‌నున్నారు. టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఈ వెబ్ సిరీస్‌ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఆహాలో ప్ర‌సారం కానున్న వెబ్ సిరీస్‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు మ‌రి కొద్ది రోజుల‌లో తెలియనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement